Thimmapur: తిమ్మాపూర్‌లో వీవోఏల వినూత్న నిరసన: చెవిలో పువ్వులతో నిరసన!

Thimmapur: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని గ్రామైక్య సంఘం కార్యాలయం ఎదుట వీవోఏలు వినూత్న నిరసన తెలిపారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 25 May 2026 11:57 AM IST
Thimmapur
X

Thimmapur: తిమ్మాపూర్‌లో వీవోఏల వినూత్న నిరసన: చెవిలో పువ్వులతో నిరసన!

Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని గ్రామైక్య సంఘం కార్యాలయం ఎదుట చెవిలో పువ్వులతో నిరసన తెలిపారు వీవోఏలు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18 నుండి నిరసన తెలుపుతున్నవిలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వీవోఏ)లు ఈరోజు తిమ్మాపూర్ గ్రామైక్య సంఘం కార్యాలయం ఎదుట చెవిలో పువ్వులు పెట్టుకుని వీవోఏలు నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షురాలు నగునూరి మంజుల పాల్గొని మాట్లాడుతూ జీతం 20వేలు ప్రభుత్వమే ఇవ్వాలని, ఉద్యోగ భద్రతా కల్పించాలని, 58జీవోను సవరించాలని, సెర్ప్ నుండి ఐడీ కార్డులు ఇవ్వాలని, భీమా కల్పించాలని డిమాండ్ చేశారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story