Huzurabad: హుజురాబాద్‌లో రూ.30 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ప్రణవ్
Huzurabad: హుజురాబాద్‌లో 82 మంది లబ్ధిదారులకు రూ.30 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన వొడితల ప్రణవ్. అవినీతికి పాల్పడితే సస్పెండ్ చేస్తామని హెచ్చరిక.
Huzurabad: హుజురాబాద్‌లో రూ.30 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ప్రణవ్
హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ.అభివృద్ధి,సంక్షేమం-కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన లక్ష్యం.వొడితల ప్రణవ్. నిరుపేద లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన హుజురాబాద్ ఇంచార్జి ప్రణవ్ బాబు- సంక్షేమ పథకాల విషయంలో పారదర్శకత పాటిస్తున్నాం.ఎవరైనా డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటాం,అవసరమైతే సస్పెండ్ కి వెనకాడం.
ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలో నిరుపేదలైన లబ్ధిదారులకు సంక్షేమం అభివృద్ధి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.మంగళవారం నాడు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 82 మంది,30 లక్షల విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు నేరుగా అందజేశారు.
నిరుపేదలు పరిస్థితి బాగోలేక ఆసుపత్రులపాలైన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో అండగా ఉంటుందని,ఇప్పటివరకు హుజురాబాద్ లో సుమారు 10కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేశామని అన్నారు.ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పారదర్శకత పాటిస్తున్నాం,డబ్బులు అడిగితే సస్పెండ్ కి వెనకాడం.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో పారదర్శకతను పాటిస్తున్నామని త్వరలో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వబోతున్నామని అన్నారు.సంక్షేమ పథకాల విషయంలో ఏవరైనా డబ్బులు అడిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అన్ని మండలాల ప్రజా ప్రజాప్రతినిధులు,మండలాల అధ్యక్షులు,అనుబంధ సంఘాల నాయకులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




