Karimnagar: గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులను కాపాడాలి: సీపీ ఆదేశం!

Karimnagar: వరంగల్–కరీంనగర్ జాతీయ రహదారి (NH 563) పై సరికొత్త భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘాను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 24 Oct 2026 6:03 PM IST
Karimnagar
X

Karimnagar: గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులను కాపాడాలి: సీపీ ఆదేశం!

కరీంనగర్: నూతనంగా నిర్మించిన వరంగల్ – కరీంనగర్ జాతీయ రహదారి (NH 563) పై ప్రయాణికుల భద్రత, ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

కొత్తగట్టు వద్ద ఏర్పాటు చేసిన హైవే పెట్రోలింగ్ యూనిట్, టోల్ ప్లాజా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ అమర్చిన సీసీ కెమెరాల పనితీరు, నిఘా వ్యవస్థ, కంట్రోల్ రూమ్ ద్వారా వాహనాల రాకపోకలను పర్యవేక్షించే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.

రహదారిపై ఏవైనా రోడ్డు ప్రమాదాలు లేదా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు సమాచారం అందుకునే వ్యవస్థ (Emergency Response System), కంట్రోల్ రూమ్ నుంచి తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకునే విధానం, బాధితులకు వేగంగా వైద్య సహాయం అందించేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే క్షతగాత్రులను కాపాడేందుకు ‘గోల్డెన్ అవర్’లో తక్షణమే స్పందించి, ఆసుపత్రులకు తరలించే సమన్వయ వ్యవస్థ పక్కాగా ఉండాలన్నారు.

సీసీ కెమెరాల నిఘాను నిరంతరం పర్యవేక్షిస్తూ, మితిమీరిన వేగం మరియు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై నిఘా ఉంచాలని సూచించారు. హైవేపై ప్రయాణించే వాహనదారులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ తనిఖీలలో హుజురాబాద్ ఏసీపీ మాధవి, రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కేశవపట్నం ఎస్సై శేఖర్ హైవే అథారిటీ ప్రతినిధులు, టోల్ గేట్ నిర్వాహకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN