Sircilla: మార్కండేయ శోభాయాత్రలో ఆకట్టుకున్న చేనేత మగ్గం!
Sircilla: సిరిసిల్లలో నిర్వహించిన మార్కండేయ శోభాయాత్రలో ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ట్రాక్టర్‌పై మగ్గం ఏర్పాటు చేసి చీర నేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.
Sircilla: మార్కండేయ శోభాయాత్రలో ఆకట్టుకున్న చేనేత మగ్గం!
సిరిసిల్ల: పట్టణంలో శుక్రవారం నిర్వహించిన మార్కండేయ శోభాయాత్రలో మగ్గం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ట్రాక్టర్‌పై మగ్గాన్ని ఏర్పాటు చేసి, అందులో చీర నేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు.
చేనేత కళాకారుడి వినూత్న ప్రదర్శనను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. శోభాయాత్రను వీక్షించిన పలువురు మగ్గం వద్ద ఆగి హరిప్రసాద్ చీర నేస్తున్న తీరును ఆసక్తిగా తిలకించారు. సిరిసిల్ల చేనేత కళా వైభవాన్ని చాటిచెప్పేలా ఈ ప్రదర్శన సాగింది. స్థానిక చేనేత సంప్రదాయాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ ఏర్పాటు చేసిన మగ్గం ప్రదర్శన శోభాయాత్రలో సందడి నెలకొల్పింది.
Next Story




