Karimnagar: ప్రతి గడపకు సంక్షేమం, ప్రతి ఇంటికి అభివృద్ధి: వొడితల ప్రణవ్!

Karimnagar: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసిన హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్.

GANESH, JAMMIKUNTA
Published on: 6 Aug 2026 6:07 PM IST
Karimnagar
X

Karimnagar: ప్రతి గడపకు సంక్షేమం, ప్రతి ఇంటికి అభివృద్ధి: వొడితల ప్రణవ్!

Karimnagar: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం,పరిధిలోని గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా ఇంటి ఇంటికి వెళ్లి పంపిణీ చేసిన ప్రణవ్.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన,గృహ ప్రవేశంలో పాల్గొన్న ఇంచార్జి.గ్రామాల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపెడుతున్నాం.

ప్రజలకు ఉపయోగపడే సిఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రజలకు త్వరగా అందజేస్తున్నామని,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గడపకు సంక్షేమాన్ని,ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు ప్రజాపాలన ద్వారా ప్రజలకు చేరవేస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.

ఇల్లందకుంట మండల పరిధిలోని ఇల్లందకుంట మండలం,చిన్న కోమటిపల్లి,టేకుర్తి,బూజునూరు,రాచపల్లి,మల్లన్నపల్లి,శ్రీ రాముల పల్లి,కనగర్తి,లక్ష్మాజీపల్లి,మల్యాల,వాగొడ్డు రామన్నపల్లి గ్రామాల్లో 24 చెక్కులను దాదాపు ఎనిమిది లక్షలు విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా ఇంటి,ఇంటికి వెళ్లి లబ్ధిదారులకుఅందజేశారు.

అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ పట్టణాల్లో,గ్రామాల్లోతిరుగుతున్నప్పుడు ప్రజలు తమ వద్దకు తీసుకొచ్చిన సమస్యలనుపరిష్కరిస్తున్నామని,కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా.అందిస్తున్నామని,పార్టీకార్యకర్తలకు,నాయకులకు ఇదే సూచన చేశామని తెలిపారు.ప్రజలకుసంక్షేమం,అభివృద్ధి విషయంలో రాజీపడమని,ఈ సందర్భంగా శ్రీరాములపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు గృహప్రవేశంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట దేవాలయ ఛైర్మెన్రామారావు,మండల అధ్యక్షుడు పెద్ది కుమార్,జిల్లా అధికార ప్రతినిధులు,డైరక్టర్లు,వివిధ గ్రామాల సర్పంచులు,వార్డు సభ్యులు,ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story