Odela: భీమరపల్లి బొడ్రాయి ఉత్సవాల్లో ప్రభుత్వ విప్ విజయరమణ రావు

Odela: పెద్దపల్లి జిల్లా భీమరపల్లిలో వైభవంగా బొడ్రాయి పండుగ మహోత్సవం. ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 7 July 2026 9:19 AM IST
Odela
X

Odela: భీమరపల్లి బొడ్రాయి ఉత్సవాల్లో ప్రభుత్వ విప్ విజయరమణ రావు

ఓదెల (పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం భీమరపల్లి గ్రామంలో భూలక్ష్మి, మహాలక్ష్మి సమేత బొడ్రాయి పండగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో పెద్దపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ చింతకుంట విజయరమణ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

​గ్రామదేవతలకు పూజలు చేసిన అనంతరం, గ్రామస్తులు ప్రభుత్వ విప్ విజయరమణ రావు గారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, గ్రామానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

​ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్, స్థానిక పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story