Kamanpur: మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో వైకుంఠధామం సమస్యల పరిష్కారం

Kamanpur: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని వైకుంఠధామం సమస్యలను మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో పరిష్కరిస్తామని సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

SHANKAR, MANTHANI
Published on: 12 Nov 2026 4:45 PM IST
Kamanpur
X

Kamanpur: మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో వైకుంఠధామం సమస్యల పరిష్కారం

పెద్దపల్లి జిల్లా: కమాన్ పూర్ మండల కేంద్రంలోని వైకుంఠ దామంలోని (స్మశాన వాటిక ) సమస్యలను మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లి వారి సహకారంతో పరిష్కరిస్తామని గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ తెలిపారు. గురువారం గ్రామ ఉపసర్పంచ్ రఫిక్ సోహెల్, పలువురు వార్డు సభ్యులతో కలిసి సర్పంచ్ వైకుంఠ దామాన్ని పరిశీలించారు.

వైకుంఠ దామం ప్రక్కనే వేస్తున్న చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం, బోర్ మోటారు ఏర్పాటు చేసి దహన సంస్కారాలు అనంతరం స్నానలు చేసేందుకు వీలుగా నల్లాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

అలాగే విశ్రాంతి గదులను నిర్మించడం తదితర పనులను.. మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లి నిధులు తీసుకువచ్చి త్వరలోనే పనులు చేపడతామని సర్పంచ్ రంగు సత్యనారాయణ తెలియజేశారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI