Thimmapur: నుస్తులాపూర్‌లో మహిళపై దాడి చేసి బావిలోకి తోసేసిన దుండగుడు

Thimmapur: పని ఇప్పిస్తానని నమ్మించి మహిళా కూలీపై గోల్డ్ రాబరీ. రాత్రంతా బావిలోనే ఈదుతూ ప్రాణాలు దక్కించుకున్న లక్ష్మి. కరీంనగర్ ఆసుపత్రికి తరలింపు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 2 July 2026 5:12 PM IST
Thimmapur
X

Thimmapur: నుస్తులాపూర్‌లో మహిళపై దాడి చేసి బావిలోకి తోసేసిన దుండగుడు

తిమ్మాపూర్: పని కోసం ఓ యువకుడు కరీంనగర్ లేబర్ అడ్డా నుండి ఓ మహిళను తీసుకువచ్చి బావిలో తోసేయడంతో ఆ మహిళ రాత్రంతా బావిలోనే ఉండి గురువారం ఉదయం కేకలు వేయడంతో సమీపంలోని రైతు అక్కడకు వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని బయటకు తీసిన ఘటన తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ లో చోటుచేసుకుంది. ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కరీంనగర్ లేబర్ అడ్డ నుండి గుర్తుతెలియ యువకుడు కరీంనగర్ కిసాన్ నగర్ కు చెందిన గంగాధర లక్ష్మి 55 సం. మహిళను చెట్లు పెట్టే పని ఉందని బుధవారం ఉదయం 11గం. లకు తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ కి తీసుకువచ్చాడు. నుస్తులాపూర్ రైతు వేదిక సమీపంలో ని ఓ బావి వద్దకు తీసుకువచ్చి ఆమెపైన ఉన్న బంగారం లాక్కుని బావిలో ఆమెను నెట్టేశాడు. బావిలో ఆమె తాడును పట్టుకోగా యువకుడు తాడును కట్ చేశాడు.

ఆమె నీటిలో మునిగడంతో అక్కడి నుండి యువకుడు వెళ్ళి పోయాడు. ఆమె బావిలోనే ఈత కొడుతూ రాత్రంతా ఉండిపోయింది. గురువారం ఉదయం ఆమె కేకలు వేయడంతో సమీపంలోని ఓ రైతు గమనించి బావి వద్దకు వెళ్లి చూడగా ఆమె బావిలో కనిపించింది. ఆ రైతు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఆమెను బయటకు తీయించారు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story