Karimnagar: మంత్రి నియోజకవర్గంలోనే తప్పని నీటి తిప్పలు.. అధికారుల తీరుపై ఆగ్రహం!
Karimnagar: కరీంనగర్ జిల్లా కొండాపూర్‌లో గత 15 రోజులుగా తాగునీరు రాకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో కరీంనగర్-హుస్నాబాద్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
Karimnagar: మంత్రి నియోజకవర్గంలోనే తప్పని నీటి తిప్పలు.. అధికారుల తీరుపై ఆగ్రహం!
కరీంనగర్: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. గత 15 రోజులుగా నీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ మహిళలు ఖాళీ బిందెలతో కరీంనగర్–హుస్నాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
దాదాపు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైవే పనుల్లో భాగంగా పైప్‌లైన్ పగిలిపోవడంతో నీరు వృథాగా పోతున్నప్పటికీ, తమకు పైప్‌లైన్ కనెక్షన్ పునరుద్ధరించకపోవడంతో తాగేందుకు సైతం నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మెయిన్ రోడ్ కాలనీవాసులు తెలిపారు.
సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నియోజకవర్గంలోనే నీళ్ల కోసం ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని, వెంటనే పైప్‌లైన్ మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలని మహిళలు డిమాండ్ చేశారు.




