Karimnagar: మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం – సీపీ గౌష్ ఆలం
Karimnagar: కరీంనగర్‌లో మహిళల భద్రత కోసం షీ టీమ్స్ నిరంతరం కృషి చేస్తున్నాయని సీపీ గౌష్ ఆలం తెలిపారు.
Karimnagar: మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం – సీపీ గౌష్ ఆలం
కరీంనగర్: మహిళలు, యువతులు, బాలికలు ఆకతాయిల వల్ల గానీ, మరే ఇతర వేధింపుల వల్ల గానీ ఇబ్బందులు ఎదుర్కొంటుంటే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని జిల్లా పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం ఐపిఎస్ తెలిపారు. జిల్లాలో మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ విభాగాలు నిరంతరం పనిచేస్తున్నాయని, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని అన్నారు. బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. సామాజిక మాధ్యమాలలో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలని సూచించిన సీపీ, మే మాసంలో జిల్లా వ్యాప్తంగా షీ టీమ్స్ ద్వారా 8 క్రిమినల్ కేసులు, 19 పెట్టీ కేసులు నమోదు చేశామని, 70 హాట్‌స్పాట్‌లపై నిఘా ఉంచి 35 మంది పోకిరీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చామని వెల్లడించారు.
అత్యవసర పరిస్థితుల్లో మహిళలు *8712670759* నంబర్‌కు గానీ, *Dial 100/112* కు గానీ సంప్రదించాలని, అలాగే ఒంటరి ప్రయాణాల్లో భద్రత కోసం *T-SAFE APP* వినియోగించుకోవాలని సీపీ కోరారు.




