Sircilla: వన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లెయిమ్స్‌ను వెంటనే పరిష్కరించాలి!
Sircilla: భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ మరణ సహాయం క్లెయిమ్స్ పరిష్కరించి, వెంటనే లేబర్ కార్డులు జారీ చేయాలని కోరుతూ సిరిసిల్ల జిల్లా కార్మిక అధికారి.
Sircilla: వన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లెయిమ్స్‌ను వెంటనే పరిష్కరించాలి!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా: భవన నిర్మాణ కార్మికుల లేబర్ కార్డులు, మరణ సహాయం క్లెయిమ్స్‌తో పాటు సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, అర్హులైన కార్మికులకు తక్షణమే ప్రయోజనాలు అందించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అక్కెనపల్లి భాస్కర్ కోరారు.కార్మికుల సమస్యలపై భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రతినిధులు సిరిసిల్ల జిల్లా కార్మిక అధికారి సాగర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికుల మరణ సహాయం క్లెయిమ్స్ ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉండటంతో మృతుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అధికారికి వివరించారు. పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్‌ను వెంటనే పరిశీలించి, అర్హులైన కుటుంబాలకు సహాయం త్వరగా అందించాలని కోరారు.
అలాగే లేబర్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికుల వివరాల్లో తప్పులను సవరించి, అర్హులైన వారికి వెంటనే కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కార్డుల ద్వారా నమోదైన నిర్మాణ కార్మికులకు ప్రమాద మరణం, సహజ మరణం, వైకల్యం, ప్రసూతి, వివాహ సహాయం వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతాయని తెలిపారు.తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా ప్రమాద మరణానికి రూ.6 లక్షలు, వైకల్యానికి రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటిస్తూ, అర్హులైన ప్రతి కార్మికుడికి ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు కొంపెల్లి విజయ్, బోడ రమేష్, కోడుముంజ గంగయ్య, అందె సుదర్శన్‌తో పాటు స్థానిక భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.




