Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైభవంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో 14 మంది పేద లబ్ధిదారులకు రూ. 3.84 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 10 Sept 2026 7:49 AM IST
Sircilla
X

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైభవంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత!

Sircilla: పేద, మధ్యతరగతి ప్రజలకు అనారోగ్య సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఆర్థికంగా ఆసరాగా నిలుస్తోందని ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చెన్ని బాబు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పలువురు పేదలు వివిధ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందగా, వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని బుధవారం నంది విగ్రహం వద్ద చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. సీనియర్ జర్నలిస్టు ఎదురుగట్ల ముత్తయ్య గౌడ్‌తో పాటు మొత్తం 14 మంది లబ్ధిదారులకు రూ.3 లక్షల 84 వేల విలువైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా చెన్ని బాబు మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం కొంతమేర తగ్గుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నేవూరి రవీందర్ రెడ్డి, బండారి బాల్రెడ్డి, నంది కిషన్, గంట బుచ్చగౌడ్, రాములు, పందిళ్ల శ్రీనివాస్ గౌడ్, రేసు శంకర్, ఇమామ్ బాయ్, గంట అంజాగౌడ్, బి.పేట రాజ్‌కుమార్, దొంతి రాజేందర్ రెడ్డి, కస్తూరి ప్రవీణ్ రెడ్డి, సిరిపురం నరేందర్, సత్యనారాయణ, వడ్నాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story