Yellareddypet: ఆలయాల్లో వరుస చోరీలు.. నిందితుడి అరెస్ట్, రిమాండ్
Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడిన ముద్రకోల నరసింహులు అరెస్ట్; ఆలయాలకు సీసీ కెమెరాలపై ఎస్సై సూచన.
Yellareddypet: ఆలయాల్లో వరుస చోరీలు.. నిందితుడి అరెస్ట్, రిమాండ్
ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలోని ఆలయాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 20న గొల్లపల్లి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం హుండీని పగలగొట్టి అందులోని సుమారు రూ.3 వేల నగదును దొంగిలించారు. అదేవిధంగా గ్రామంలోని శివాలయం, కొత్తకుంట హనుమాన్ దేవాలయంలోనూ చోరీలు జరిగాయి. ఈ ఘటనలపై నిమ్మతుల రామ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆధారాలు సేకరించిన పోలీసులు గొల్లపల్లి గ్రామానికి చెందిన ముద్రకోల నరసింహులు (51) ఈ చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై ఎన్. రమేష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఆలయాల నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, హుండీలకు పటిష్టమైన భద్రత కల్పించాలని సూచించారు. ఆలయాల్లో విలువైన వస్తువులు, నగదు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామాల్లో నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.




