Yellareddypet: మహిళా వార్డు సభ్యురాలిపై దాడి దంపతులపై కేసు నమోదు!

Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా కిష్టునాయక్ తండాలో మహిళా వార్డు సభ్యురాలిపై దాడి. సీసీటీవీ విజువల్స్ వైరల్. ఇద్దరిపై కేసు నమోదు చేసిన ఎల్లారెడ్డిపేట పోలీసులు.

KALEEM, SIRICILLA
Published on: 9 Nov 2026 7:27 AM IST
Yellareddypet
X

Yellareddypet: మహిళా వార్డు సభ్యురాలిపై దాడి దంపతులపై కేసు నమోదు!

Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్ తండాలో మహిళా వార్డు సభ్యురాలిపై దాడి ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టునాయక్ తండాకు చెందిన బానోతు అరుణ గత సర్పంచ్ ఎన్నికల్లో వార్డు సభ్యురాలిగా పోటీ చేసి విజయం సాధించారు. అదే ఎన్నికల్లో పోటీ చేసిన మాలోతు నిర్మల, ఆమె భర్త హనుమంతు అప్పటి నుంచి తనను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అరుణ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ క్రమంలో నవంబర్ 8న సాయంత్రం 4.50 గంటల సమయంలో నిర్మల, ఆమె భర్త హనుమంతు తన ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించి అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా చేతులతో దాడి చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డిపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె. చంద్రశేఖర్ ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA