Yellareddypeta: ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

Yellareddypeta: ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక. అధ్యక్షుడిగా బుగ్గ కృష్ణమూర్తి శర్మ, ప్రధాన కార్యదర్శిగా ఒగ్గు బాలరాజు యాదవ్ ఎంపిక.

KALEEM, SIRICILLA
Published on: 12 Sept 2026 10:55 PM IST
Yellareddypeta
X

Yellareddypeta: ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల స్థాయిలో జర్నలిస్టుల ఐక్యత, వృత్తిపరమైన అభివృద్ధితో పాటు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలనే లక్ష్యంతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.

ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులుగా బండారి బాల్రెడ్డి, కాసు శ్రీనివాసరాజు ఎన్నిక కాగా, అధ్యక్షుడిగా బుగ్గ కృష్ణమూర్తి శర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కులేరి కిషోర్ కుమార్, దుర్గం విజయ్ బాబు, పెంటం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఒగ్గు బాలరాజు యాదవ్ ఎన్నికయ్యారు.

కార్యదర్శులుగా కులేరి దీప్తి కుమార్, ఒగ్గు మహేష్ చంద్ర, కోశాధికారిగా శ్రీ రామోజీ శేఖర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సలహాదారులుగా చిట్కూరి తిరుపతి, శ్రీ రామోజీ ప్రవీణ్, సురేష్ యాదవ్ ఎన్నికయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా సురేష్, చేపూరి నాగరాజు, చింతకింది శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా హిమకొండ పద్మా రెడ్డి, ముద్రకోలా కృష్ణ, బెస్త నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని తెలిపారు. పాత్రికేయుల హక్కులు, సంక్షేమం కోసం ముందుండి పనిచేస్తామని, ఎల్లారెడ్డిపేట మండలంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజా సమస్యలను వాస్తవాల ఆధారంగా వెలుగులోకి తీసుకువచ్చి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, సామాజిక అంశాలను ప్రజలకు చేరవేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఏర్పడటంతో జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు, వివిధ వర్గాల నాయకులు నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రాచర్ల గొల్లపల్లి సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ సభ్యులను శాలువాలతో సన్మానించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA