Yellareddypeta: వర్షపు నీటి సంరక్షణకు రెండు ఇంకుడు గుంతల ఏర్పాటు

Yellareddypeta: ఎల్లారెడ్డిపేటలో వర్షపు నీటి వృథాను అరికట్టేందుకు రెండు ఇంకుడు గుంతలు. సర్పంచ్ నరసింహులు ఆధ్వర్యంలో నీటి సంరక్షణ చర్యలు.

KALEEM, SIRICILLA
Published on: 15 Sept 2026 7:18 PM IST
Yellareddypeta
X

Yellareddypeta: వర్షపు నీటి సంరక్షణకు రెండు ఇంకుడు గుంతల ఏర్పాటు

ఎల్లారెడ్డిపేట: వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా భూమిలోకి ఇంకేలా చేయడానికి ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో రెండు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీ సర్పంచ్ ఎనుగందుల నరసింహులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఎనుగందుల నరసింహులు మాట్లాడుతూ.. వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించవచ్చని తెలిపారు. గ్రామంలో నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. భవిష్యత్ తరాలకు నీటి కొరత రాకుండా వర్షపు నీటిని సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని నీటి సంరక్షణ కార్యక్రమాలను చేపడతామని సర్పంచ్ తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA