Yellareddypeta: పదిర గ్రామంలో ఘనంగా అంతర్జాతీయ తల్లిపాల దినోత్సవం

Yellareddypeta: ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో ఘనంగా తల్లిపాల దినోత్సవం. గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించిన సిబ్బంది.

KALEEM, SIRICILLA
Published on: 11 Aug 2026 9:14 PM IST
Yellareddypeta
X

Yellareddypeta: పదిర గ్రామంలో ఘనంగా అంతర్జాతీయ తల్లిపాల దినోత్సవం

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో అంతర్జాతీయ తల్లిపాల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, శిశువులకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.

తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య సిబ్బంది వివరించారు. శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలని, మొదటి ఆరు నెలల పాటు పూర్తిగా తల్లిపాలనే అందించాలని సూచించారు.

తల్లిపాల ద్వారా శిశువుల ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అందుతాయని, తల్లిపాలను ప్రోత్సహించడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోనాల మణెమ్మ, గ్రామ పంచాయతీ కార్యదర్శి దివ్య, ఆశా వర్కర్ పద్మ, అంగన్వాడీ టీచర్ సుమలత, ఆయాలు రజిత, లక్ష్మవ్వతో పాటు గర్భిణీలు, బాలింతలు, మహిళలు పాల్గొన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story