Veenavanka: ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడి యువకుడి ఆత్మహత్య
Veenavanka: వీణవంక మండలం మామిడాలపల్లిలో 24 ఏళ్ల యువకుడు సింగరవేన సుధాకర్ ఆత్మహత్య.
Veenavanka: ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడి యువకుడి ఆత్మహత్య
Veenavanka: వీణవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో సింగరవేన సుధాకర్ 24సం. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసుల వివరాల ప్రకారం సుధాకర్ కరీంనగర్‌లోని జిప్టో సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.
ప్రతిరోజూ విధులకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకునే సుధాకర్, ఈ నెల 9న కూడా విధులు ముగించుకుని గ్రామానికి వచ్చాడు. కొద్దిసేపు ఇంటి వద్ద గడిపిన అనంతరం బయటకు వెళ్లిన అతను తిరిగి ఇంటికి రాలేదు.రాత్రి ఆలస్యమైనా సుధాకర్ ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామంలోని మంచినీళ్ల బావి సమీపంలో ఉన్న వేపచెట్టుకు ధోతితో ఉరివేసుకుని మృతిచెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.మృతుడి తల్లి సింగరవేని సారమ్మ ఇచ్చిన ఫిర్యాదులో తన కుమారుడి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి వెల్లడించారు.




