Karimnagar: పురుగుల మందు, పెట్రోల్ డబ్బాతో గ్రామపంచాయతీ ముందు నిరసన!
Karimnagar: ట్రోల్ డబ్బాతో గ్రామపంచాయతీ కార్యాలయం ముందు వినూత్న నిరసన చేపట్టారు. ఈ సంచలన ఉదంతం పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Karimnagar: పురుగుల మందు, పెట్రోల్ డబ్బాతో గ్రామపంచాయతీ ముందు నిరసన!
కరీంనగర్ జిల్లా: తమ కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని పురుగుల మందు, పెట్రోల్ డబ్బాతో గ్రామపంచాయతీ ముందు నిరసన.తమ భూమిని ప్రభుత్వ భూమి అంటూ సర్పంచ్ ఇద్దరు వార్డు మెంబర్లు వేధింపులకు గురి చేస్తున్నారంటూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కుర్ర హరీష్ తమ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామపంచాయతీ ముందు పురుగుల మందు పెట్రోల్ డబ్బాతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బాధితుడు హరీష్ మాట్లాడుతూ ఊరి చివరన 12 గుంటలలో తమ తాతల కాలం నుండి ఇల్లు కట్టుకొని జీవిస్తున్నామని, తమకు పట్ట డాక్యుమెంట్స్ ఉన్న గ్రామ సర్పంచ్ రంగన వేణి లచ్చినర్సు, కార్యదర్శితో పాటు మరో ఇద్దరు వార్డు మెంబర్లు కలిసి తమ భూమిలో నుంచి మూడు గంటల భూమిని వివో బిల్డింగ్ కు ఇవ్వాలంటూ తమ కుటుంబాన్ని తరచూ వేదిలింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
అధికారులకు చెప్పిన ఎవరు పట్టించుకోవడంలేదని వాపోయాడు. వేధింపులు ఆపకపోతే తను ఆత్మహత్య చేసుకుంటానని తన చావుకు సర్పంచ్, గ్రామ కార్యదర్శి ఇద్దరు వార్డు మెంబర్లు కారణం అవుతారని హెచ్చరించాడు.




