Jagtial: ఘోర ప్రమాదం..డివైడర్‌ను ఢీకొని యువకుడు మృతి, తాత పరిస్థితి విషమం!

Jagtial: జగిత్యాల బైపాస్ రోడ్డులో ద్విచక్రవాహనం డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో పెగడపల్లికి చెందిన గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన తాత తీవ్రంగా గాయపడ్డారు.

ANAND, JAGITYAL
Published on: 9 Aug 2026 11:00 PM IST
Jagtial
X

Jagtial: ఘోర ప్రమాదం..డివైడర్‌ను ఢీకొని యువకుడు మృతి, తాత పరిస్థితి విషమం!

జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది.. పెగడపల్లి మండలం దీకొండ గ్రామానికి చెందిన గంగాధర్ తన తాతతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన తాతను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.. ఇందుకు సంబందించిన సీసీ పుటేజీలో ప్రమాద దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story