Jammikunta: రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ పర్యటన గ్రామస్తుల డిమాండ్

Jammikunta: జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామంలో నూతన గ్రంథాలయం ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్‌కు వినతిపత్రం సమర్పించిన గ్రామస్తులు.

GANESH, JAMMIKUNTA
Published on: 27 May 2026 3:37 PM IST
Jammikunta
X

Jammikunta: రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ పర్యటన గ్రామస్తుల డిమాండ్

జమ్మికుంట: తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ జమ్మికుంటకు విచ్చేసిన సందర్భంగా కొత్తపల్లి గ్రామంలో నూతన గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, యువత విద్యార్థులు మాట్లాడుతూ కొత్తపల్లిలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తే విద్యార్థులకు పోటీ పరీక్షల సిద్ధతకు, చదువులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

గ్రామీణ ప్రాంత యువతకు జ్ఞాన వికాసం కలిగించే విధంగా గ్రంథాలయం ఎంతో అవసరమని పేర్కొన్నారు. వినతిపత్రాన్ని స్వీకరించిన చైర్మన్ రియాజ్ మాట్లాడుతూ మూడు నెలల వ్యవధిలో కొత్తపల్లిలో నూతన గ్రంథాలయ ఏర్పాటుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story