Sircilla: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: డాక్టర్ గిద్యోన్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, బైబిల్ భక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని నడవాలని డాక్టర్ గిద్యోన్ పిలుపునిచ్చారు.

KALEEM, SIRICILLA
Published on: 14 Sept 2026 4:26 PM IST
Sircilla
X

Sircilla: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: డాక్టర్ గిద్యోన్!

Sircilla: యువత చెడు వ్యసనాలు, చెడు స్నేహాలకు ఆకర్షితులు కాకుండా మంచి మార్గంలో నడవాలని డాక్టర్ గిద్యోన్ సూచించారు. యువత దేశానికి, సమాజానికి భవిష్యత్‌ బలమని, వారి ఆలోచనలు, ప్రవర్తన సరైన దిశలో ఉంటే కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

బైబిల్‌లో దేవునిపై విశ్వాసంతో, నీతి మార్గంలో జీవించిన దావీదు, యోసేపు, దానియేలు వంటి భక్తుల జీవితాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎన్నో కష్టాలు, ప్రలోభాలు ఎదురైనా వారు దేవుని మార్గాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసంలో నిలిచారని, వారి జీవితాలు నేటి యువతకు గొప్ప ఆదర్శమని పేర్కొన్నారు.

“నీతిమంతులకు దేవుడు తోడుగా ఉంటాడు” అనే విశ్వాసంతో యువత నిజాయితీ, క్రమశిక్షణ, ప్రేమ, క్షమ, సేవాభావం వంటి మంచి లక్షణాలను అలవర్చుకోవాలని అన్నారు. చెడు వ్యసనాలు ఆరోగ్యంతో పాటు కుటుంబ సంబంధాలు, భవిష్యత్తును దెబ్బతీస్తాయని హెచ్చరించారు. విద్య, ఉపాధి, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక విషయాలపై యువత దృష్టి సారించాలని సూచించారు.

ఇతరులకు సహాయం చేయడం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, సమాజం కోసం మంచి పనులు చేయడం ద్వారా యువతలో బాధ్యతాభావం పెరుగుతుందని డాక్టర్ గిద్యోన్ తెలిపారు. చెడు మార్గాలను విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ, పెద్దలను గౌరవించి, మంచి స్నేహాలను ఎంచుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాస్టర్లు, మండల ప్రధాన కార్యదర్శి కులేరి దీప్తి కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి రాజేష్, పాస్టర్ ప్రేమ్ కుమార్, దేవయ్య, డానియల్, దేవరాజ్, యోబు, జోనతన్, డేవిడ్, కులేరి కిషోర్ కుమార్ తదితరులతో పాటు సుమారు 100 మంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA