Karimnagar: మోదీకి పాట పాడుతూ వినూత్న నిరసన రైల్వే ట్రాక్‌పై యువత ఫైర్!
Karimnagar: కరీంనగర్‌లో ఓ రైల్వే బ్రిడ్జి నిర్మాణ జాప్యంపై ఇద్దరు యువకులు వినూత్న నిరసన చేపట్టారు.
Karimnagar: మోదీకి పాట పాడుతూ వినూత్న నిరసన రైల్వే ట్రాక్‌పై యువత ఫైర్!
కరీంనగర్: కరీంనగర్ భారతీయుడు కోట శ్యామ్ కుమార్, బెల్లపు కరుణాకర్ వినూత్నంగా నిరసన చేపట్టారు రైల్వే ట్రాక్ పై మన్ కి బాత్ వింటూ మోదీ కి సూటి ప్రశ్న వేశారు. మేము మీ మనసులోని మాట వింటున్నాం మరి మా మనసులోని మాట ఎవరు వింటారు అంటూ రైల్వే బ్రిడ్జి దగ్గర పడుతున్న కష్టాల గురించి తెలియ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలు గడుస్తున్న చిన్న బ్రిడ్జి కూడా పూర్తి కాలేదు అంటూ మండిపడ్డారు. ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు అని వాపోయారు.
నీ మనసులోని మాట మేము వింటున్నాం మరి మా మాట మా బాధ ఎవరు వినాలి ఇక్కడ ఉన్న నాయకులు పట్టించుకోవడం లేదు, అక్కడ నుండి నీవు ఆదేశాలు ఇవ్వలేవు అని అన్నారు. రైల్వే ట్రాక్ పనులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని, అంబులెన్స్ దారి లేక రోజు గేటు పడితే ఎంతో మంది ప్రాణాలు పోయాయని గుర్తు చేశారు.
కాంట్రాక్టర్లు కనీసం రోడ్డుపై మట్టి పోయడం లేదని ఫీట్ల గోతులలో కెళ్ళి ప్రజలు నరకయాతన అనుభవిస్తూ ప్రయాణం చేస్తున్నారని, నగరాన్ని సుందరంగా మారుస్తున్న అధికారులు నాయకులు కనీసానికి దారైనా సరిగా వేయండి అని కోరారు. వర్షం పడితే చాలు మోకాళ్ళ లోతు గోతులు ఏర్పడుతున్నాయని మట్టి పోయకుండా కనీస మెయింటెనెన్స్ లేక కాంట్రాక్టర్ తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్న పట్టించుకున్న నాథుడు లేడు అన్నారు.
నాయకులు వెళ్లకుండా ఈ దారి గుండా వెళ్లకుండా పక్కదారి నుంచి వెళుతూ ఈ దారిని పట్టించుకోకుండా ఇబ్బందులు గుర్తించకుండా తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు.ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి అని మోదీ ని ప్రశ్నించారు. లాస్ట్ లో మోదీ కి అంకితం అని పాట కూడా పాడారు.




