Etapaka: అంబులెన్స్‌లో దొరికిన నగదును తిరిగిచ్చిన 108 సిబ్బంది!

Etapaka: ఎటపాక మండలంలో రోడ్డు ప్రమాద బాధితుడి అంబులెన్స్‌లో పడిపోయిన రూ.50 వేల నగదును తిరిగి కుటుంబ సభ్యులకు అందజేసిన 108 సిబ్బంది లక్ష్మణ్, మహేష్.

RAJESH REDDY, CHINTOOR
Published on: 13 Sept 2026 8:28 AM IST
Etapaka
X

Etapaka: అంబులెన్స్‌లో దొరికిన నగదును తిరిగిచ్చిన 108 సిబ్బంది!

Etapaka: రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలించే క్రమంలో వాహనంలో పడిపోయిన రూ.50 వేల నగదును సదరు బాధితుడి కుటుంబ సభ్యులకు అప్పగించి 108 అంబులెన్స్ సిబ్బంది నిజాయితీని చాటుకున్నారు.

ఎటపాక మండల పరిధిలోని పురుషోత్తపట్నం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మణుగూరు మండలం రామానుజవరం గ్రామానికి చెందిన శ్రీలామంతుల మల్లాచారి (60) తీవ్రంగా గాయపడి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అయితే తీవ్రంగా గాయపడిన మల్లాచారిని 108లో తరలించే క్రమంలో తన వద్ద ఉన్న రూ.50 వేల నగదు అంబులెన్సులో పడిపోగా వాహనాన్ని శుభ్రపరిచే క్రమంలో నగదును గుర్తించిన ఈఎమ్‌టీ లక్ష్మణ్ ,పైలట్ (డ్రైవర్) మహేష్ లు భద్రపరిచి మల్లాచారి కుటుంబ సభ్యులకు భద్రాచలంలోని అశోక్ నగర్ కాలనీలో శనివారం నాడు అందజేశారు.

దాంతో పోగొట్టుకున్న నగదు అందజేసిన 108 సిబ్బందికి మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. దొరికిన సొమ్మును బాధితులకు అందించడం పట్ల పలువురు 108 సిబ్బందిని అభినందించారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR