Julurpad: 108 అంబులెన్స్ సేవలపై ఈఎంఈ సతీష్ ఆకస్మిక తనిఖీ!

Julurpad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని 108 అంబులెన్స్ సేవల కేంద్రాన్ని ప్రాజెక్ట్ ఈఎంఈ సతీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 29 Nov 2026 7:44 AM IST
Julurpad
X

Julurpad: 108 అంబులెన్స్ సేవలపై ఈఎంఈ సతీష్ ఆకస్మిక తనిఖీ!

Julurpad: జూలూరుపాడు మండలంలోని 108 అత్యవసర సేవల కేంద్రాన్ని 108 ప్రాజెక్ట్ ఈఎంఈ సతీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 108, 102 అంబులెన్స్ వాహనాలను పరిశీలించి, అత్యవసర వైద్య పరికరాలు, మందుల నిల్వలు, వాహనాల నిర్వహణ, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు వేగంగా స్పందించాలని పైలట్లు, ఈఎంటీలకు సూచించారు. అంబులెన్స్‌లను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు విధుల పట్ల పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.

ఈ తనిఖీలో వాహన సిబ్బంది ఈఎంటీ శ్రీనివాస్, పైలట్ నరేందర్ కుమార్ పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU