Sathupalli: సత్తుపల్లిలో 2,000 మట్టి వినాయక విగ్రహాల పంపిణీ: మాధురి మధు

Sathupalli: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మాధురి మధు ఆధ్వర్యంలో ఆర్టీసీ డీఎం లక్ష్మీనారాయణ చేతుల మీదుగా 2,000 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 13 Sept 2026 9:22 PM IST
Sathupalli
X

Sathupalli: సత్తుపల్లిలో 2,000 మట్టి వినాయక విగ్రహాల పంపిణీ: మాధురి మధు

సత్తుపల్లి: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ లక్ష్యంగా గత తొమ్మిదేళ్లుగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని మాధురి మధు తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం సత్తుపల్లిలో 2,000 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.

విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని సత్తుపల్లి ఆర్టీసీ డీఎం లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి విగ్రహాల వినియోగం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని, ప్రజలు రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను ఉపయోగించాలని సూచించారు.

గత తొమ్మిదేళ్లుగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్న మాధురి మధును పలువురు అభినందించారు. కార్యక్రమంలో భక్తులు, స్థానికులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI