Julurupadu: జూలూరుపాడులో ఏఐటీయూసీలోకి 50 మంది ఆటో కార్మికులు చేరిక!
Julurupadu: జూలూరుపాడులో TUCI నుంచి AITUC లోకి 50 మంది ఆటో కార్మికులు చేరారు. కార్మికులకు కండువాలు కప్పి ఆహ్వానించిన ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల జమలయ్య.
Julurupadu: జూలూరుపాడులో ఏఐటీయూసీలోకి 50 మంది ఆటో కార్మికులు చేరిక!
Julurupadu: జూలూరుపాడు టి యు సి ఐ నుంచి ఏఐటీయూసీ పోరాటాలకు ఆకర్షితులై 50 మంది ఆటో కార్మికులు ఏఐటీయూసీలోకి చేరారు సోమవారం వారికి ఏఐటియుసి (ఆటో వర్కర్స్ యూనియన్) రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య కండువా కప్పి వారిని ఆహ్వానించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం మండల కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ఆటో కార్మికులు నష్టపోతున్నారని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి కాలం గడుపుతున్నారని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్మికులకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న అమలు చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందారని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఆటో కార్మికులకు ఆటో స్టాండ్లు లను ఏర్పాటు చేయాలని అర్హులైన ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల ద్వారా ఆటోలు ముంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు కంచర్ల రాఘవేంద్రరావు,వలమల సామేలు గార్లపాటి వీరభద్రం యాసా రోశయ్య సిరిపురపు వెంకటేశ్వర్లు ఏఐటీయూసీ మండల అధ్యక్షులు గార్లపాటి శివకృష్ణ కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ అబ్బులు దేశి తదితరులు పాల్గొన్నారు




