Khammam: ఖమ్మంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు!

Khammam: ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చైర్మన్ ఎండీ ఖాదర్ బాబా ఆధ్వర్యంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 20 Nov 2026 9:04 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు!

ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి ఖాదర్ బాబా* గారి ఆధ్వర్యంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుడా చైర్మన్ పూవాళ్ళ దుర్గా ప్రసాద్, డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, అర్బన్ డీసీసీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, ఏఎంసీ చైర్మన్ హనుమంతు రావు, కమర్తపు మురళి, రావూరి సాయిధబాబు, పుచ్చకాయల వీరభద్రం తదితరులు హాజరయ్యారు.

సుడా చైర్మన్ పూవాళ్ళ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ, చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా గారి ప్రత్యేక చొరవతో వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఎంతో ఘనంగా, క్రమబద్ధంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రతి కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో, అందరినీ సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా నిర్వహించిన చైర్మన్ గారి కృషిని ప్రశంసించారు.

డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థులు, యువతలో పఠనాసక్తి పెంపొందించడంతో పాటు వారిలోని ప్రతిభను వెలికితీసేలా చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా గారు చేపట్టిన కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. వారం రోజుల పాటు అన్ని కార్యక్రమాలను ఎంతో చక్కగా నిర్వహించిన చైర్మన్, కార్యదర్శి మరియు సిబ్బందిని అభినందించారు.

అనంతరం వారోత్సవాల్లో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, డాన్స్, యోగా తదితర పోటీల విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి ఖాదర్ బాబా గారు మాట్లాడుతూ, 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయడంలో సహకరించిన ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులు, పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్యదర్శి మరియు గ్రంథాలయ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఖమ్మం జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార మరియు చేనేత శాఖల మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రత్యేక చొరవ, సహకారంతో జిల్లా గ్రంథాలయ సంస్థకు నూతన భవనం అందుబాటులోకి రానుండటం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. గ్రంథాలయ అభివృద్ధికి, విద్యార్థులు మరియు నిరుద్యోగ యువతకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మంత్రి గారు అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు.

వచ్చే సంవత్సరం 60వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో అందుబాటులోకి రానున్న నూతన గ్రంథాలయ భవనంలో మరింత ఘనంగా నిర్వహించుకుందామని ఆకాంక్షించారు. అందరి సహకారంతో ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్యదర్శి పి. పద్మజ, గ్రేడ్-1 లైబ్రేరియన్ సి.హెచ్. మాలసూరు, గ్రేడ్-3 లైబ్రేరియన్లు బాబు, వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ పి. సంతోష్, ఇతర సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.