Bhadrachalam: తాలిపేరు ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తివేత!
Bhadrachalam: చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరద. 8 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ప్రాజెక్టు నీటిమట్టం 73.16 మీటర్లకు చేరిక.
Bhadrachalam: తాలిపేరు ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తివేత!
Bhadrachalam: భద్రాచలం సెప్టెంబర్ 24 -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో ఆ ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి దిగువున ఉన్న గోదావరిలోకి 11 క్యూసెక్కుల వరద నీటిని ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు చత్తీస్గఢ్ గుట్టల ప్రాంతంలో ఉన్న పలు వాగులు వంకలు పొంగి తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది.
ప్రాజెక్టు కెపాసిటీ 74 మీటర్లు ఉండటంతో వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధిత ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గేట్లను విడుదల చేస్తున్నారు.
మరోవైపు పంట పొలాలకు నీరు అందే విధంగా ఎడమ కుడి కాలవల గేట్లను విడుదల చేస్తూ పంట పొలాలకు నీరు అందిస్తున్నారు. ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టు వరద నీరు 73.16 మీటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.




