Khammam: ఆకలి తీరుస్తున్న ‘వీల్స్ ఆన్ మీల్స్’.. సత్తుపల్లిలో అరుదైన రికార్డు
Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం 900 రోజులు పూర్తి చేసుకుంది.
Khammam: ఆకలి తీరుస్తున్న ‘వీల్స్ ఆన్ మీల్స్’.. సత్తుపల్లిలో అరుదైన రికార్డు
ఖమ్మం జిల్లా: సత్తుపల్లి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సేవా కార్యక్రమాలలో భాగంగా సత్తుపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం బుధవారం నాటికి 900 రోజులు పూర్తి అయింది. గత తొమ్మిది వందల రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రతి రోజు ఉదయం స్థానిక బస్ స్టాండ్ సెంటర్‌లో, ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రోగులకు, వారి బంధువులకు, అలాగే బస్టాండ్ సెంటర్లో యాచకులు, నిరుపేదలకు అల్పాహారం అందిస్తున్నారు. ఈ రకంగా రోజుకు సుమారు 200 మందికి పైగా ఈ సహాయం అందుతుంది.
900 రోజులు అయిన సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సేవల విస్తరణ విభాగం నిర్వాహకులు మందపాటి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... దాతల సహకారంతో ఈ కార్యక్రమం ఎటువంటి విఘాతం లేకుండా కొనసాగుతోందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈ సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని అన్నారు. సత్తుపల్లి
లయన్స్ క్లబ్ అధ్యక్షులు గోగడ రవికుమార్ మాట్లాడుతూ....
ఈ ప్రాంతంలోని దాతలు లయన్స్ క్లబ్ సేవలకు విశేషంగా స్పందిస్తూ “వీల్స్ ఆన్ మీల్స్” కార్యక్రమం ద్వారా అల్పాహారం కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ బాద్యులు పెనుగొండ రమేష్, దారా కృష్ణారావు, కొత్తూరు సత్యనారాయణ, మేధా లయన్స్ క్లబ్ నిర్వాహకులు పసుపులేటి నాగేశ్వరరావు, మొరిశెట్టి సాంబశివగుప్తా, దొడ్డ కృష్ణయ్య, జంగా సత్యనారాయణ, చల్లగుండ్ల అప్పారావు, మిద్దె శ్రీను, స్టార్ క్లబ్ బాద్యులు విజయ సారధి రెడ్డి, ఎస్ కే వలి,సన్నీ తదితరులు పాల్గొన్నారు. అల్పాహార కార్యక్రమానికి నిత్యం సేవలందిస్తున్న కే. పి. ఆర్. గౌతమ్ పాఠశాల నిర్వాహకులు మందపాటి ప్రభాకర్ రెడ్డి, ఆహారం సరఫరా, వడ్డన పడ్డనకు ఉచిత సేవలందిస్తున్న రాంబాబును ఈ సందర్భంగా సత్కరించారు.




