Cherla: నీటి పొదుపులో ఆదర్శంగా నిలుస్తున్న చర్ల ఆదివాసులు!

Cherla: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఆదివాసులు వర్షపు నీటిని కుంటల ద్వారా నిల్వ చేస్తూ వ్యవసాయం చేస్తున్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 26 Oct 2026 3:29 PM IST
Cherla
X

Cherla: నీటి పొదుపులో ఆదర్శంగా నిలుస్తున్న చర్ల ఆదివాసులు!

Cherla: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్ల మండలంలో ఎలిడిపో ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును ఒడిస్పట్టి జాగ్రత్తగా వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం లోని చర్ల మండలం ఆదివాసులు ఎప్పటినుంచో నీటు పొదుపు యజ్ఞం తెస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సాధారణంగా బోర్లు వేసేందుకు అనుమతులు లేని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులు ఆకాశవాయి పంటలను సాగు చేసి బ్రతుకు జీవనం సాగిస్తున్నారు.

చర్ల మండలంలోని కొండివాయ్ గూడెం, బక్కచింతలపాడు, ఎర్ర బోరు, కుర్నపల్లి దాదాపు 30 గ్రామాల్లో ఆదివాసులు నీటిని నిల్వ చేసేందుకు 40 కుంటలు తమకున్నారు. ఈ నీటిని పొదుపుగా వాడుతూ పంటలను సాగు చేస్తున్నారు. 5 వేల ఎకరాల్లో వరితోపాటు పత్తి,మిరప లాంటి వాణిజ్య పంటలను పండిస్తున్నారు వర్షపు నీరు తేలికగా ఒక చోటికి చేరుకునే విధంగా వారు గుట్టల కింద ఎత్తైన ప్రదేశాల్లో కుంటలను తోముకున్నారు.

ఇదే కుంటలను ఈ కాలం మొత్తం జాగ్రత్తగా పొదుపు చేసుకుంటున్నారు. ఒకపక్క ఆదివాసి ప్రాంతాల్లో సరైన కరెంటు సౌకర్యం కూడా లేకపోవడం మరోపక్క ఎలినివో ఎఫెక్ట్ ఇలా ఎన్ని సమస్యలు ఉన్నాగాని ఆ ఆదివాసి రైతన్నలకు ఈ కుంటలే ఆధారం.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem