Bayyaram: తెల్లం శరత్ బాబుకు నివాళి.. బయ్యారంలో ఆదివాసీల కొవ్వొత్తుల ర్యాలీ!

Bayyaram: భద్రాచలం ఘర్షణలో మృతి చెందిన తెల్లం శరత్ బాబుకు నివాళులర్పిస్తూ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 22 Nov 2026 7:50 AM IST
Bayyaram
X

Bayyaram: తెల్లం శరత్ బాబుకు నివాళి.. బయ్యారంలో ఆదివాసీల కొవ్వొత్తుల ర్యాలీ!

Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తపేట గ్రామంలో కొమరం భీం కాలనీలో కుల పెద్దయిన మెస్సు రాజశేఖర్ దొర ఆధ్వర్యంలో భద్రాచలంలో ఇటీవల మృతి చెందిన తెల్లం శరత్ బాబుకు నివాళులర్పించి , కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని ఈ సందర్భంగా మెస్సు రాజశేఖర్ దొర మాట్లాడుతూ భద్రాచలంలో తెల్లం శరత్ బాబును హత్య చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని మెస్సు రాజశేఖర్ దొర డిమాండ్ చేశారు.

శిరీష మరణం కొద్ది రోజులకే ఇలా ఆదివాసీలపై హత్యలు చేయడంపై ఏమిటని, ప్రశ్నించారు ,ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరాముని దేవస్థానం ఉన్న భద్రాచలం వంటి ప్రశాంతమైన ప్రాంతంలో వరుసగా హత్యలు, నేరాలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని, మా ఆదివాసుల ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదివాసి నాయకులు ఇరుప రామారావు ఆదివాసి భాషలోనే మాట్లాడుతూ... అమాయక మా గిరిజనులు టార్గెట్ చేస్తూ హత్యలు చేయడం చాలా బాధాకరమైన విషయమని , శిరీష మరణం కొద్ది రోజులకి మరల ఇలా తెల్లం శరత్ బాబును కొట్టి చంపటం చాలా బాధాకరమని, శరత్ బాబు నివాళులర్పిస్తూ కొత్తపేటలో కొవ్వొత్తు రాలి భారీగా నిర్వహించామని,భద్రాచలంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, పోలీసు యంత్రాంగంపై ఉందని అన్నారు.

నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం, పోలీసు అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యం కారణంగానే ఇటువంటి దారుణ ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. హత్యలకు పాల్పడుతున్న నేరస్థుల పట్ల ఎలాంటి ఉపేక్ష చూపకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, హత్య వెనుక ఉన్న అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపి బాధ్యులందరినీ చట్టం ముందు నిలబెట్టాలని కోరారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రజలకు భద్రత కల్పించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భద్రాచలంలో హత్యలు, దాడులు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి, ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితులు కల్పించాలి. ప్రజాసంఘాలు, ఆదివాసీ సంఘాలు, రాజకీయ పార్టీలు ఐక్యంగా నిలబడి హత్యల సంస్కృతికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు, కుల పెద్దయిన కొట్టెం పుల్లయ్య, వట్టం శీను, సూర్ణపాక వెంకటేష్ (పండు) చింత నందు, చాట్ల అశోక్, చాట్ల సంపత్, చాట్ల పాపారావు, ఆదివాసి మహిళా నాయకురాలు పరిషక రమ, తాటి అమల, ఆదివాసి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM