Kothagudem: లక్ష్మీదేవిపల్లిలో ఘనంగా కొమరం భీమ్ వర్ధంతి..నివాళులర్పించిన ఆదివాసీలు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో కొమరం భీమ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Kothagudem: లక్ష్మీదేవిపల్లిలో ఘనంగా కొమరం భీమ్ వర్ధంతి..నివాళులర్పించిన ఆదివాసీలు!
Kothagudem: ఆదివాసీల ఆశాజ్యోతి, పోరాట యోధుడు కొమరం భీమ్‌కు ఆదివాసీ నాయకులు ఘన నివాళులర్పించారు. లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని ఇల్లందు క్రాస్ వద్ద ఉన్న కొమరం భీమ్ సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు సనప కోటేశ్వరరావు మాట్లాడుతూ.. జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం కొమరం భీమ్ నిజాం ప్రభుత్వంపై వీరోచిత పోరాటం చేశారని కొనియాడారు. ఆయన త్యాగాలు, పోరాటాలు నేటి ఆదివాసీ తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
కొమరం భీమ్ జయంతి, వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం ఆదివాసీలను విస్మరించడమేనని విమర్శించారు. జిల్లా స్థాయిలో వేడుకల నిర్వహణకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కులు, చట్టాలు, ఉద్యోగాల అమలుతో పాటు వారి సంస్కృతి, సంప్రదాయాలు, అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. కొమరం భీమ్‌కు తగిన గుర్తింపు కల్పించి, రాష్ట్రవ్యాప్తంగా ఆయన జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో పాయం లక్ష్మీనర్సు, తుడుం దెబ్బ జిల్లా కార్యదర్శి, బట్టు కనకరాజు సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి, వర్సా నరసింహారావు,
తుడుందెబ్బ లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షుడు, తాటి పుల్లయ్య, జిల్లా నాయకులు, గుమ్మడిశెట్టి తుడుం దెబ్బ సీనియర్ నాయకులు, గొప్ప రమేష్, పడిగ రామారావు తదితరులు పాల్గొన్నారు.




