Bhadrachalam: అక్టోబర్ 5న కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ఆదివాసీల మహాధర్నా!
Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట అక్టోబర్ 5న నిర్వహించనున్న ఆదివాసీల మహాధర్నాను విజయవంతం చేయాలని కన్వీనర్ ఇరప రాజుదొర పిలుపునిచ్చారు.
Bhadrachalam: అక్టోబర్ 5న కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ఆదివాసీల మహాధర్నా!
Bhadrachalam: ఆదివాసీల భూమి, హక్కులు, ఉద్యోగాలు, చట్టపరమైన రక్షణ, గౌరవప్రదమైన జీవనం కోసం అక్టోబర్ 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజుదొర పిలుపునిచ్చారు.
ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ఈ మహాధర్నాకు జిల్లా నలుమూలల నుంచి ఆదివాసీ సమాజం పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.
మా ప్రధాన డిమాండ్లు
జీవో నెం.3ను పునరుద్ధరించాలి, ఆదివాసీ యువత ఉద్యోగ అవకాశాలకు రక్షణ కల్పించే విధంగా తగిన చట్టబద్ధమైన చర్యలు చేపట్టాలి, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.
ఆదివాసీల భూముల అక్రమ బదలాయింపులు, ఆక్రమణలను అరికట్టి ఆదివాసీ భూములకు సంపూర్ణ రక్షణ కల్పించాలి.




