Ashwaraopeta: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో న్యాయవాది లక్కినేని నరేంద్ర!
Ashwaraopeta: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించిన అశ్వారావుపేట సీనియర్ న్యాయవాది లక్కినేని నరేంద్రబాబు.
Ashwaraopeta: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో న్యాయవాది లక్కినేని నరేంద్ర!
Ashwaraopeta: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అశ్వారావుపేట అడ్వాకెట్ లక్కినేని నరేంద్ర పోటీ చేసే అవకాశం. లాయర్ గా లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా, సోషల్ వర్కర్గ్ ఉమ్మడి జిల్లాలో చిరపరిచితులు. త్వరలో జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అశ్వారావుపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు, సీనియర్ అడ్వకేట్ లక్కినేని నరేంద్రబాబు బరిలో నిలవనున్నారు.
అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న పట్టభద్రులు వారి యొక్క ఓటుని నమోదు చేయించుకుని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థిని ఎన్నుకోవడానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. విద్యావంతుల హక్కులను భవిష్యత్తులో ముందుకు తీసుకోవడానికి ఓటు అనేది చాలా ప్రధానమైనది, ఓటును నమోదు చేసుకొని సరైనటువంటి అభ్యర్థిని గెలిపించుకుంటే పట్టభద్రులకు అందవలసినటువంటి అన్ని అవకాశాలను సాధించే అవకాశం ఉందని అన్నారు.
సరైన వ్యక్తిని ఎన్నుకోవటానికి ఓటు అనేది ప్రధానం, అందువలన నియోజకవర్గ పట్టభద్రులు సమయం తక్కువగా ఉన్నది కావున ఆన్లైన్ ద్వారా ఓటు అప్లై చేసుకొని ఉండవలసిందిగా న్యాయవాది లక్కినేని నరేంద్రబాబు కోరారు.
రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పట్టభద్రుడు, న్యాయవాది లయన్స్ క్లబ్ సేవాస్ఫూర్తితో ముందుకు వెళ్తున్నటువంటి లక్కినేని నరేంద్రబాబు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు, ఖమ్మం వరంగల్ నల్గొండ న్యాయవాదుల సహాయ సహకారాలు, పై మూడు జిల్లాలో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ బాధ్యులు బలపరిచి గ్రాడ్యుయేట్స్ యొక్క హక్కుల కోసం పోరాడి వారికి కావలసినటువంటి నిజమైన సహాయ సహకారాలు అందే విధంగా ఉంటానని తెలిపారు.
సీనియర్ న్యాయవాది అయినటువంటి లక్కినేని కి న్యాయవాదులు సహాయ సహకారాలతో పాటు లయన్స్ క్లబ్ అందదండలు కూడా పుష్కలంగా ఉండే అవకాశం ఉండటంతో నరేంద్ర బాబు పోటీ ప్రాముఖ్యత సంతరించుకుంది.




