Kothagudem: నవంబర్ 25 నుంచి కొత్తగూడెంలో ఆగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రారంభం!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో నవంబర్ 25 నుంచి ఆగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రారంభం. బాధితులు, డిపాజిటర్లు, ఏజెంట్లు షెడ్యూల్ ప్రకారం హాజరుకావాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు.
Kothagudem: నవంబర్ 25 నుంచి కొత్తగూడెంలో ఆగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రారంభం!
Kothagudem: ఆగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులకు ఉపశమనం కల్పించి న్యాయం జరిగేలా చూడాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్ల వద్ద ఉన్న అసలు ఆగ్రిగోల్డ్ బాండ్లు, నగదు రసీదుల ధృవీకరణ మరియు వివరాల నమోదు కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు భద్రాచలం పరిధిలోని బాధితులు, డిపాజిటర్లు, ఏజెంట్ల సౌకర్యార్థం హేమచంద్రపురంలోని జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేక ధృవీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం 25.11.2026 నుంచి అందుబాటులోకి రానుంది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మాట్లాడుతూ, ఆగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ధృవీకరణ కేంద్రాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లు నిర్ణీత తేదీ నుంచి తమకు కేటాయించిన షెడ్యూల్ ప్రకారం కేంద్రానికి హాజరై, అవసరమైన పత్రాలతో బాండ్ల ధృవీకరణ మరియు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు.
ధృవీకరణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సూచించిన పత్రాలన్నింటినీ ముందుగానే సిద్ధం చేసుకోవాలని, అసలు బాండ్లను కేవలం పరిశీలన కోసం మాత్రమే చూపించాలని, వాటిని అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బాధితులు ఈ ప్రక్రియపై ఎలాంటి అపోహలకు గురికాకుండా, అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
ధృవీకరణ కేంద్రం వివరాలు
కేంద్రం పేరు: కొత్తగూడెం
పరిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు భద్రాచలం
కేంద్రం చిరునామా: జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్, హేమచంద్రపురం, కొత్తగూడెం
కేంద్రం ఇన్చార్జ్: ఎ. రామకాంత్, IOP, CCS, BKGD
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్:8712682128, పోలీస్ కంట్రోల్ రూమ్.
ధృవీకరణకు తీసుకురావాల్సిన పత్రాలు
డిపాజిటర్ జీవించి ఉన్నట్లయితే
అసలు ఆగ్రిగోల్డ్ బాండ్ / నగదు రసీదు (ధృవీకరణ కోసం తప్పనిసరిగా చూపించాలి).
అసలు బాండ్‌కు సంబంధించిన సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ జిరాక్స్.
ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు జిరాక్స్.
పాన్ కార్డు జిరాక్స్.
బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ (ఖాతాదారుని పేరు, ఖాతా నంబర్, IFSC కోడ్ స్పష్టంగా ఉండాలి).
తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
డిపాజిటర్ మొబైల్ నంబర్.
బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్.
ఏజెంట్ పేరు, మొబైల్ నంబర్ (తెలిస్తే).
డిపాజిటర్ మరణించి, నామినీ జీవించి ఉన్నట్లయితే
అసలు బాండ్ (ధృవీకరణ కోసం చూపించాలి).
అసలు బాండ్ కలర్ జిరాక్స్ (నామినీ సంతకంతో).
డిపాజిటర్ మరణ ధృవీకరణ పత్రం జిరాక్స్.
నామినీ ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్.
రేషన్ కార్డు / కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం.
నామినీ బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్.
నామినీ తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
నామినీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్.
ఏజెంట్ వివరాలు (తెలిస్తే).
డిపాజిటర్ మరియు నామినీ ఇద్దరూ మరణించినట్లయితే
అసలు బాండ్ (ధృవీకరణ కోసం చూపించాలి).
బాండ్ కలర్ జిరాక్స్ (చట్టబద్ధ వారసుడు / కుటుంబ సభ్యుని సంతకంతో).
డిపాజిటర్, నామినీ ఇద్దరి మరణ ధృవీకరణ పత్రాలు (అసలు చూపించి జిరాక్స్ సమర్పించాలి).
చట్టబద్ధ వారసుని ఆధార్, పాన్ కార్డులు (అసలు చూపించి జిరాక్స్ సమర్పించాలి).
రేషన్ కార్డు / కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం (అసలు చూపించి జిరాక్స్ సమర్పించాలి).
చట్టబద్ధ వారసుని బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్.
తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్.
ఏజెంట్ వివరాలు (తెలిస్తే).
డిపాజిటర్ జీవించి ఉండి, ధృవీకరణ కేంద్రానికి స్వయంగా రాలేని సందర్భంలో
డిపాజిటర్ అసలు బాండ్ మరియు సంతకం చేసిన కలర్ జిరాక్స్.
డిపాజిటర్ ఆధార్, పాన్, బ్యాంక్ పాస్‌బుక్, ఫోటో (అసలు చూపించి జిరాక్స్ సమర్పించాలి).
హాజరయ్యే కుటుంబ సభ్యుని ఆధార్ / గుర్తింపు కార్డు (అసలు చూపించి జిరాక్స్ సమర్పించాలి).
కుటుంబ సంబంధాన్ని నిరూపించే పత్రం / ధృవీకరణ పత్రం జిరాక్స్.
రేషన్ కార్డు లేదా కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం ద్వారా డిపాజిటర్తో సంబంధాన్ని నిర్ధారించాలి.
డిపాజిటర్ మొబైల్ నంబర్.
డిపాజిటర్ నుంచి జారీ చేసిన అధికార పత్రం (Authorization Letter).
ఏజెంట్ల ద్వారా బాండ్ల సమర్పణ విధానం
ప్రతి అసలు బాండ్‌ను ధృవీకరణ కోసం చూపించి, దాని కలర్ జిరాక్స్ సమర్పించాలి.
ప్రతి బాండ్ గుర్తింపు సంఖ్యను విడివిడిగా నమోదు చేయాలి.
ఏజెంట్ ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్ సమర్పించాలి.
ఏజెంట్ బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ సమర్పించాలి.
ఏజెంట్ తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో, మొబైల్ నంబర్ ఇవ్వాలి.
ఏజెంట్ కోడ్ తప్పనిసరిగా పేర్కొనాలి.
సమర్పించిన బాండ్ల సంఖ్యను లెక్కించి రికార్డుల్లో నమోదు చేయడం జరుగుతుంది.
ముఖ్యమైన సూచనలు
అసలు ఆగ్రిగోల్డ్ బాండ్‌ను కేవలం ధృవీకరణ కోసం మాత్రమే చూపించాలి. అసలు బాండ్‌ను అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదు.
బాండ్ కలర్ జిరాక్స్‌పై సంబంధిత డిపాజిటర్ / నామినీ / చట్టబద్ధ వారసుడు సంతకం చేసి సమర్పించాలి.
కలర్ జిరాక్స్లో బాండ్ నంబర్‌తో సహా అన్ని వివరాలు స్పష్టంగా కనిపించాలి.
బ్యాంక్ పాస్‌బుక్‌లో ఖాతాదారుని పేరు, ఖాతా నంబర్, IFSC కోడ్ స్పష్టంగా ఉండాలి. సమర్పించే బ్యాంక్ ఖాతాకు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి.
ఏజెంట్ వివరాలు తెలియని పక్షంలో దరఖాస్తులో 'తెలియదు / అందుబాటులో లేదు' అని పేర్కొనవచ్చు.
డిపాజిటర్ / కుటుంబ సభ్యుడు / ఏజెంట్‌కు సంబంధించిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా అందించాలి.
పత్రాలు స్వీకరించిన అనంతరం సంబంధిత వ్యక్తులకు రసీదు అందజేయబడుతుంది.
ధృవీకరణ కేంద్రం పనివేళలు
ధృవీకరణ ప్రక్రియ ప్రతి పని దినంలో ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగుతుంది. మండలాల వారీగా ప్రతిరోజు మొదటి 250 మంది ఖాతాదారుల ధ్రువపత్రాలను మాత్రమే పరిశీలించడం జరుగుతుంది.
మండలాల వారీగా ధృవీకరణ తేదీలు, ఖాతాల వివరాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు భద్రాచలం పరిధిలోని బాధితుల సౌకర్యార్థం మండలాల వారీగా ధృవీకరణ తేదీలను కేటాయించడం జరిగింది. ఏ తేదీన ఏ మండలానికి చెందిన ఎంతమంది డిపాజిటర్లు హాజరుకావాలో వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
క్రమ సంఖ్య| తేదీ| మండలం / ఖాతాల సంఖ్య
1| 25-11-2026| అల్లపల్లి (250)
2| 26-11-2026| అల్లపల్లి (9), అన్నపురెడ్డిపల్లి (241)
3| 27-11-2026| అన్నపురెడ్డిపల్లి (10), అశ్వాపురం (240)
4| 28-11-2026| అశ్వాపురం (250)
5| 30-11-2026| అశ్వాపురం (250)
6| 01-12-2026| అశ్వాపురం (250)
7| 02-12-2026| అశ్వాపురం (250)
8| 03-12-2026| అశ్వాపురం (16), అశ్వారావుపేట (234)
9| 04-12-2026| అశ్వారావుపేట (250)
10| 05-12-2026| అశ్వారావుపేట (70), భద్రాచలం (180)
11| 07-12-2026| భద్రాచలం (250)
12| 08-12-2026| భద్రాచలం (250)
13| 09-12-2026| భద్రాచలం (250)
14| 10-12-2026| భద్రాచలం (250)
15| 11-12-2026| భద్రాచలం (250)
16| 14-12-2026| భద్రాచలం (250)
17| 15-12-2026| భద్రాచలం (250)
18| 16-12-2026| భద్రాచలం (250)
19| 17-12-2026| భద్రాచలం (250)
20| 18-12-2026| భద్రాచలం (5), బూర్గంపహాడ్ (245)
21| 19-12-2026| బూర్గంపహాడ్ (250)
22| 21-12-2026| బూర్గంపహాడ్ (250)
23| 22-12-2026| బూర్గంపహాడ్ (250)
24| 23-12-2026| బూర్గంపహాడ్ (250)
25| 24-12-2026| బూర్గంపహాడ్ (250)
26| 28-12-2026| బూర్గంపహాడ్ (196), చండ్రుగొండ (54)
27| 29-12-2026| చండ్రుగొండ (250)
28| 30-12-2026| చండ్రుగొండ (250)
29| 31-12-2026| చండ్రుగొండ (250)
30| 01-01-2027| చండ్రుగొండ (221), చర్ల (29)
31| 02-01-2027| చర్ల (250)
32| 04-01-2027| చర్ల (250)
33| 05-01-2027| చర్ల (250)
34| 06-01-2027| చర్ల (250)
35| 07-01-2027| చర్ల (250)
36| 08-01-2027| చర్ల (207), చుంచుపల్లి (43)
37| 11-01-2027| చుంచుపల్లి (217), దమ్మపేట (33)
38| 12-01-2027| దమ్మపేట (250)
39| 13-01-2027| దమ్మపేట (250)
40| 16-01-2027| దమ్మపేట (250)
41| 18-01-2027| దమ్మపేట (112), దుమ్ముగూడెం (138)
42| 19-01-2027| దుమ్ముగూడెం (250)
43| 20-01-2027| దుమ్ముగూడెం (250)
44| 21-01-2027| దుమ్ముగూడెం (250)
45| 22-01-2027| దుమ్ముగూడెం (250)
46| 23-01-2027| దుమ్ముగూడెం (30), గుండాల (220)
47| 25-01-2027| గుండాల (250)
48| 27-01-2027| గుండాల (29), జూలూరుపాడు (221)
49| 28-01-2027| జూలూరుపాడు (250)
50| 29-01-2027| జూలూరుపాడు (143), కరకగూడెం (107)
51| 31-01-2027| కరకగూడెం (151), కొత్తగూడెం (99)
52| 01-02-2027| కొత్తగూడెం (250)
53| 02-02-2027| కొత్తగూడెం (250)
54| 03-02-2027| కొత్తగూడెం (250)
55| 04-02-2027| కొత్తగూడెం (250)
56| 05-02-2027| కొత్తగూడెం (250)
57| 06-02-2027| కొత్తగూడెం (250)
58| 08-02-2027| కొత్తగూడెం (250)
59| 09-02-2027| కొత్తగూడెం (250)
60| 10-02-2027| కొత్తగూడెం (250)
61| 11-02-2027| కొత్తగూడెం (250)
62| 12-02-2027| కొత్తగూడెం (250)
63| 15-02-2027| కొత్తగూడెం (250)
64| 16-02-2027| కొత్తగూడెం (145), లక్ష్మీదేవిపల్లి (105)
65| 17-02-2027| లక్ష్మీదేవిపల్లి (177), మణుగూరు (73)
66| 18-02-2027| మణుగూరు (250)
67| 19-02-2027| మణుగూరు (250)
68| 20-02-2027| మణుగూరు (250)
69| 22-02-2027| మణుగూరు (250)
70| 23-02-2027| మణుగూరు (213), ములకలపల్లి (37)
71| 24-02-2027| ములకలపల్లి (250)
72| 25-02-2027| ములకలపల్లి (250)
73| 26-02-2027| ములకలపల్లి (250)
74| 27-02-2027| ములకలపల్లి (189), పాల్వంచ (61)
75| 01-03-2027| పాల్వంచ (250)
76| 02-03-2027| పాల్వంచ (250)
77| 03-03-2027| పాల్వంచ (250)
78| 04-03-2027| పాల్వంచ (250)
79| 05-03-2027| పాల్వంచ (250)
80| 08-03-2027| పాల్వంచ (250)
81| 09-03-2027| పాల్వంచ (250)
82| 11-03-2027| పాల్వంచ (250)
83| 12-03-2027| పాల్వంచ (250)
84| 15-03-2027| పాల్వంచ (109), పినపాక (141)
85| 16-03-2027| పినపాక (250)
86| 17-03-2027| పినపాక (250)
87| 18-03-2027| పినపాక (250)
88| 19-03-2027| పినపాక (250)
89| 20-03-2027| పినపాక (250)
90| 24-03-2027| పినపాక (185), సుజాతనగర్ (65)
91| 25-03-2027| సుజాతనగర్ (250)
92| 27-03-2027| సుజాతనగర్ (47), టేకులపల్లి (203)
93| 29-03-2027| టేకులపల్లి (250)
94| 30-03-2027| టేకులపల్లి (250)
95| 31-03-2027| టేకులపల్లి (250)
96| 01-04-2027| టేకులపల్లి (20), ఇల్లందు (230)
97| 02-04-2027| ఇల్లందు (250)
98| 03-04-2027| ఇల్లందు (250)
99| 06-04-2027| ఇల్లందు (250)
100| 07-04-2027| ఇల్లందు (250)
101| 09-04-2027| ఇల్లందు (138)
కావున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు భద్రాచలం పరిధిలోని ఆగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లు తమకు కేటాయించిన తేదీని గమనించి, అవసరమైన అన్ని అసలు పత్రాలు మరియు జిరాక్స్ కాపీలతో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ధృవీకరణ కేంద్రానికి హాజరై నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.




