Julurupadu: భద్రాద్రి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి: AIKMS ధర్నా
Julurupadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Julurupadu: భద్రాద్రి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి: AIKMS ధర్నా
జూలూరుపాడు: పూర్తిగా ఏజెన్సీ అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ జూలూరుపాడు తహసిల్దార్ కార్యాలయం ధర్నా వినతిపత్రం అందజేసిన AIKMS
రాష్ట్రంలోనే పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరువు ప్రాంతంగా ప్రకటించాలని తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు జూలూరుపాడు తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేయడం జరిగింది.
అనంతరం AIKMS రాష్ట్ర నాయకులు SK ఉమర్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి వల్లోజు రమేష్, మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 376 మండలాలలో వర్షపాతం పూర్తిగా లేదని 20% వరి మాత్రమే సాగైందని వారన్నారు గతం కంటే ఈ సారి వర్ష నమోదు శాతం తగ్గడం పంటల సాగు తగ్గడం వీటివలన రైతులు కూలీలు పనులు లేక అర్ధాకాలీ తో అలమటిస్తూ వడ్డీలు అప్పులు కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొని ఉందని ఈ తరుణంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని అలాగే బోరు బావల కింద కరెంటుతో సాగు చేసుకుంటున్న రైతులకు 16 గంటల విద్యుత్ సౌకర్యం కల్పించాలని అవగాహన లేని రైతులకు యాప్ ల వలన ఇబ్బందులు అవుతున్నాయి.
రైతులకు యాప్ సిస్టo ని కూడా రద్దు చేయాలని వారు అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకం 200 పని దినాలు నడిపించాలని రోజువారి కూలిగా 600 ఇవ్వాలని వారు అన్నారు. అనంతరం మండల తహసిల్దార్ శ్రీనివాస్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ విషయంపై పై అధికారులకు తెలియజేస్తానని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో AIKMS రాష్ట్ర నాయకులు ఎస్ కే ఉమర్ వల్లోజీ రమేష్ మండల కార్యదర్శి, IFTU జిల్లా నాయకులు కూరాకుల నరసింహారావు,తెల్లం వెంకటేశ్వర్లు మండల సెక్రెటరీ, కల్తీ నరసరావు మండల కమిటీ సభ్యుడు రాధాకృష్ణ సభ్యుడు, చూడ నరసరావు సభ్యుడు, తదితరులు పాల్గొన్నారు.




