Sujathanagar: సుజాతనగర్‌లో ఏఐకేఎస్ మహాసభల ప్రచారం ప్రారంభం!
Sujathanagar: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభల ప్రచారం.. 36 బెలూన్లు ఎగరవేసి రైతు సంఘం నాయకుల పిలుపు.
Sujathanagar: సుజాతనగర్‌లో ఏఐకేఎస్ మహాసభల ప్రచారం ప్రారంభం!
Sujathanagar: అఖిల భారత రైతు కిసాన్ సభ (AIKS) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు కునుసోతు ధర్మ పిలుపునిచ్చారు.
మహాసభల ప్రచారంలో భాగంగా సుజాతనగర్ మండల రైతు సంఘం కమిటీ ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు నల్లగోపు పుల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో AIKS మహాసభలకు గుర్తుగా 36 బెలూన్లను ఎగరవేశారు.
ఈ సందర్భంగా కునుసోతు ధర్మ మాట్లాడుతూ నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు నల్లగొండలో AIKS 36వ జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1,500 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరుకానున్నారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, వ్యవసాయ రంగ కార్పొరేటీకరణ, విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రైతు సంఘం పోరాటాలు కొనసాగిస్తుందని ధర్మ తెలిపారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
అన్ని పంటలకు మద్దతు ధర కల్పించడంతో పాటు రైతు భరోసా, రైతు రుణమాఫీ పథకాల అమలుపై కూడా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు జాతీయ మహాసభలు కీలక వేదికగా నిలుస్తాయని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి బచ్చలకూర శ్రీనివాసరావు, నాయకులు భూక్య శంకర్, కిషన్, కొండ కృష్ణ, బాలు, బాల వెంకటేశ్వర్లు, కుమారి, గూగుల్ అతి కిషన్, జ్యోతిరామ్ తదితరులు పాల్గొన్నారు.




