Kothagudem: కొత్తగూడెం ఆర్ సి ఓ ఏ క్లబ్‌లో ఏఐటీయూసీ కేంద్ర కౌన్సిల్ సమావేశం

Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా ఏఐటీయూసీ కేంద్ర కౌన్సిల్ సమావేశం. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యానికి డిమాండ్.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 7 Jun 2026 7:29 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం ఆర్ సి ఓ ఏ క్లబ్‌లో ఏఐటీయూసీ కేంద్ర కౌన్సిల్ సమావేశం

Kothagudem: కొత్తగూడెం ఏరియాలోని ఆర్ సి ఓ ఏ క్లబ్‌లో ఏఐటీయూసీ కేంద్ర కౌన్సిల్ సమావేశం మొదటి రోజు ఘనంగా నిర్వహించబడింది. సమావేశానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు యూనియన్ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు హాజరై ప్రసంగించారు. అలాగే యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.

నాయకులు తమ ప్రసంగాలలో సింగరేణిలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రస్తావిస్తూ, యాజమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు భంగం కలిగించే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

అదేవిధంగా, గత నెల గోలేటి నుండి కొత్తగూడెం వరకు నిర్వహించిన సింగరేణి జాత విజయవంతం కావడంలో సహకరించిన ప్రతి నాయకుడికి ప్రతి కార్మికుడికి, నాయకుడికి, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు.

సమావేశంలో సింగరేణి కార్మికులకు సంబంధించిన పలు కీలక సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా క్రింది డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు:

రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణికి రావలసిన రూ.56 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి. కొత్త గనుల ప్రారంభానికి చర్యలు చేపట్టాలి. ఏసీబీ విచారణ పేరుతో నిలిపివేసిన మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలి. మారుపేర్లు, విజిలెన్స్ కేసుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలి. పెర్క్స్‌పై విధిస్తున్న ఆదాయపు పన్నును యాజమాన్యమే భరించాలి. స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో ఒప్పుకున్న డిమాండ్లను అమలు చేయాలి. క్లర్క్ పోస్టుల భర్తీకి కోర్టు కేసుతో సంబంధం లేకుండా వెంటనే పరీక్షలు నిర్వహించాలి.

పెండింగ్‌లో ఉన్న 350 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించాలి. డిస్మిస్ అయిన కార్మికులకు ఒకసారి ప్రత్యేక అవకాశం ఇవ్వాలి. సహజ మరణం పొందిన కార్మికుని కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. మైనింగ్ స్టాప్ ప్రమోషన్ల సమస్యలు పరిష్కరించాలి.

సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం మరియు ఉద్యోగ భద్రత పరిరక్షణ కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మరియు రేపు సాయంత్రం నాలుగు గంటలకి సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు యూనియన్ కొమురయ్య గారి కాంస్య విగ్రహం పునపారంభోత్సవానికి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమం విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారూ, ఈ కార్యక్రమంలో అదనపు కార్యదర్శి మిర్యాల రంగయ్య , డిప్యూటీ జనరల్ సెక్రెటరీలు సారయ్య , కందికట్ల వీరభద్రయ్య , వై.వి.రావు , ముస్కే సమ్మయ్య , సెంట్రల్ సెక్రటరీలు ,వంగ వెంకట్,వీరస్వామి,అన్ని ఏరియాల బ్రాంచ్ సెక్రెటరీలు , సెంట్రల్ కౌన్సిల్ మెంబర్లు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story