Bhadrachalam: అల్లు అర్జున్ ఫ్యాన్స్ గొప్ప మనసు.. విద్యార్థులకు HPV పై చైతన్యం!
Bhadrachalam: భద్రాచలం గురుకుల పాఠశాలలో అల్లు అర్జున్ అభిమానుల ఆధ్వర్యంలో విద్యార్థినులకు హెచ్‌పీవీ వ్యాక్సిన్, క్యాన్సర్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Bhadrachalam: అల్లు అర్జున్ ఫ్యాన్స్ గొప్ప మనసు.. విద్యార్థులకు HPV పై చైతన్యం!
భద్రాచలం: గురుకుల పాఠశాలలో గురువారం అల్లు అర్జున్ ఫాన్స్ ఆధ్వర్యంలో HPV వ్యాక్సిన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు HPV వైరస్, వ్యాక్సిన్ ప్రాముఖ్యత, దాని ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
9 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు HPV వ్యాక్సిన్ ప్రాముఖ్యతను వివరించారు. సరైన వయస్సులో వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో HPV సంబంధిత వ్యాధులు, ముఖ్యంగా గర్భాశయ ముఖ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.
ప్రతి కుటుంబం HPV వ్యాక్సిన్ పై అవగాహన పెంచుకుని, డాక్టర్ల సలహా మేరకు పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫాన్స్ అధ్యక్షుడు చందు, వైస్ ప్రెసిడెంట్ రాకేష్, రాజేష్ రెడ్డి, చంటి తదితరులు పాల్గొన్నారు.




