Chintoor: వైయస్సార్సీపీ నేత తేజవత్ రాము భౌతికకాయానికి నివాళులు!
Chintoor: చింతూరు మండలం దొంగల జగ్గారం గ్రామానికి చెందిన వైయస్సార్సీపీ నాయకుడు తేజవత్ రాము మృతి చెందడంతో, పార్టీ నేతలు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
Chintoor: వైయస్సార్సీపీ నేత తేజవత్ రాము భౌతికకాయానికి నివాళులు!
Chintoor: వైయస్సార్సీపి నాయకుడు తేజవత్ రాము మరణం పార్టీకి తీరని లోటని పార్టీ నేతలు అన్నారు.చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి గ్రామ పంచాయతీలోని దొంగల జగ్గారం గ్రామానికి చెందిన ప్రముఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తేజవత్ రాము అకాల మరణం పై పలువురు వైయస్సార్సీపి నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
రాము భౌతికకాయానికి చింతూరు వైఎస్ఆర్సిపి కన్వీనర్ రామలింగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ చిచ్చడి మురళితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా చిచ్చడి మురళి, రామలింగారెడ్డి మాట్లాడుతూ.. తేజవత్ రాము పార్టీ ఆవిర్భావం నుండి నమ్మకమైన కార్యకర్తగా, ప్రజల మనిషిగా విశేష సేవలు అందించారని కొనియాడారు.
గ్రామంలో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి మరువలేనిది అని గుర్తుచేసుకున్నారు.ఎల్లప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండే ఒక మంచి నాయకుడిని కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తమ గాఢ సానుభూతిని తెలియజేశారు.
పార్టీ అన్ని వేళలా వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ సంతాప కార్యక్రమంలో వైయస్సార్ సిపి నాయకులు కోట్ల కృష్ణ,మాజీ సర్పంచ్ సవలం సత్తిబాబు,మాజీ ఎంపీటీసీ ఎడమ అర్జున్, మాజీ ఉప సర్పంచ్ బి బాబురావు, ధర్ముల విప్లవ కుమార్ , మరియు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.




