chintoor: చింతూరులో ప్రశాంతంగా మన్యం బంద్
chintoor: చింతూరులో జీవో-3 పునరుద్ధరణ కోరి తలపెట్టిన మన్యం బంద్ ప్రశాంతంగా ముగిసింది. గిరిజనులు రాస్తారోకోలు నిర్వహించి నిరసన తెలిపారు.
chintoor: చింతూరులో ప్రశాంతంగా మన్యం బంద్
చింతూరులో మన్యం బంద్ ప్రశాంతం
చింతూరు : పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో మన్యం బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. వరరామచంద్రాపురం, కూనవరం,వి ఆర్ పురం, ఎటపాక, చింతూరు మండల కేంద్రాలలో గిరిజనులు ఐక్యమై రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తూ బంద్ ను ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. వ్యాపారస్తులు, దుకాణదారులు మన్యం బంద్ కు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు ఈ సందర్భంగా పలువురు గిరిజన నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీలో 1/70 భూ బదలాయింపు చట్టం పరిరక్షణకు, జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ జీవో విడుదలకు డిమాండ్ చేస్తూ ఈ మన్యం బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన్యం బంద్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
Next Story




