Julurupadu: మధ్యాహ్న భోజన నాణ్యతపై కలెక్టర్ అంకిత్ సీరియస్ హెచ్చరిక!

Julurupadu: కేజీబీవీ, జెడ్పీ ప్రాథమిక పాఠశాలలను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత లోపించడంపై అసంతృప్తి వ్యక్తం

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 30 Jun 2026 4:48 PM IST
Julurupadu
X

Julurupadu: మధ్యాహ్న భోజన నాణ్యతపై కలెక్టర్ అంకిత్ సీరియస్ హెచ్చరిక!

జూలూరుపాడు: మండలం జూలూరుపాడు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల మరియు కళాశాల, జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, కళాశాలను సందర్శించి కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులను పరిశీలించారు. ఏడో, ఎనిమిదో తరగతి విద్యార్థినులతో మాట్లాడి వారికి అందుతున్న విద్యా సౌకర్యాలు, వసతి, భోజనం తదితర అంశాలపై ఆరా తీశారు. పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థినుల ఔటింగ్ రిజిస్టర్‌ను తనిఖీ చేసిన కలెక్టర్, బాలికలను తల్లిదండ్రులు లేదా అధికారికంగా అనుమతించిన సంరక్షకులతో మాత్రమే బయటకు పంపాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం కిచెన్ షెడ్‌ను పరిశీలించి విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. స్టోర్‌రూమ్‌లో నిల్వ ఉంచిన సరుకులను పరిశీలించారు.

అనంతరం కిచెన్ షెడ్‌ను పరిశీలించి విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. స్టోర్‌రూమ్‌లో నిల్వ ఉంచిన సరుకులను తనిఖీ చేశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్.ఓ.

ప్లాంట్ మరమ్మతులు ఆలస్యమవుతున్న కారణాలను అడిగి తెలుసుకుని, వెంటనే మరమ్మతులు పూర్తి చేసి విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు.

అనంతరం జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య, హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన సందర్భంగా పప్పు పలుచగా ఉండటంతో పాటు నాణ్యత లోపించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

విద్యార్థులకు వడ్డించే ఆహారం పరిశుభ్రంగా, పోషక విలువలతో, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. తాను మళ్లీ ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఆహార నాణ్యతలో లోపాలు పునరావృతమైతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు సకాలంలో అందాయా అని ఆరా తీశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం అత్యంత ముఖ్యమని అన్నారు.

విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. తాగునీరు, పరిశుభ్రత, మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లపై ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాల పెంపుతో పాటు వారి ఆరోగ్యం, సంక్షేమానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

పాఠశాలల్లో గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్ది విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు మరింత విశ్వాసం కలిగేలా విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, పరిశుభ్రత, పోషకాహార నాణ్యతను మరింత మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు .

ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో తాళ్లూరి రవి,ఎంఈఓ జుంకీలాల్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU

Next Story