Ashwapuram: గణేష్ ఉత్సవాలపై కమిటీ సభ్యులతో సీఐ ఎల్లయ్య ప్రత్యేక సమావేశం

Ashwapuram: అశ్వాపురం మండలంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై సీఐ ఎల్లయ్య హెచ్చరికలు, సూచనలు. డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు పాటించాలని స్పష్టీకరణ.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 12 Sept 2026 10:26 PM IST
Ashwapuram
X

Ashwapuram: గణేష్ ఉత్సవాలపై కమిటీ సభ్యులతో సీఐ ఎల్లయ్య ప్రత్యేక సమావేశం

అశ్వాపురం: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అశ్వాపురం సీఐ సిహెచ్. ఎల్లయ్య మండలంలోని వినాయక విగ్రహ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పోలీసుల సూచనలు, నిబంధనలను కమిటీ సభ్యులకు వివరించారు. రోడ్డు ఆక్రమిస్తూ గణేష్ మండపాలు నిర్మించవద్దని ప్రజలకు, ట్రాఫిక్ అవాంతరం లేకుండా మండపాలను నిర్మించుకోవాలని సూచించారు.

వినాయక మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, మండపాల వద్ద భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. డీజేలు, వినియోగం నిశిద్దము. మైక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని తెలిపారు. రాత్రి 10తరువాత ఎటువంటి మైకులు వినియోగించకూడదు.

ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రహదారులను పూర్తిగా దిగ్బంధించకుండా చూడాలని సూచించారు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌లు, అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మండపాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ సూచించారు. నిమజ్జన కార్యక్రమాన్ని పోలీసుల సూచనలు, నిర్దేశించిన మార్గాల్లోనే నిర్వహించాలని, యువత శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించవద్దని తెలిపారు.

ఉత్సవాల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, గొడవలకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ ఎల్లయ్య హెచ్చరించారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు కమిటీ సభ్యులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA