Ashwaraopet: లక్కీ అపార్ట్‌మెంట్స్‌లో గడపగడపకు ఎమ్మెల్సీ ఓటరు నమోదు
Ashwaraopet: అశ్వారావుపేట లక్కీ అపార్ట్‌మెంట్స్‌లో కాసాని పద్మ, కౌన్సిలర్ డాక్టర్ ఉదయజ్యోతి ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు.
Ashwaraopet: లక్కీ అపార్ట్‌మెంట్స్‌లో గడపగడపకు ఎమ్మెల్సీ ఓటరు నమోదు
అశ్వారావుపేట: అశ్వారావుపేటలోని లక్కీ అపార్ట్‌మెంట్స్‌లో ( 1 , 2 ) గడపగడపకు వెళ్లి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాసాని పద్మ, 14వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ ఉదయ జ్యోతి, మాజీ టౌన్ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్‌లోని ప్రతి ఇంటికి వెళ్లి పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన వారితో ఓటరు నమోదు చేయించారు.
ఈ కార్యక్రమంలో మోటురి మోహన్, శివ, రాజనాల గంగాధర్, కొప్పుల గంగాధర్, గౌతమి, కావ్య, పండు తదితరులు పాల్గొన్నారు.




