Ashwaraopeta: వినాయకపురం వడ్ర బజార్‌లో ఘనంగా దసరా అన్న సమారాధన

Ashwaraopeta: అశ్వారావుపేట మండలం వినాయకపురం వడ్ర బజార్‌లో దసరా సందర్భంగా ఘనంగా అన్న సమారాధన. పాల్గొని ప్రసాదం వడ్డించిన బీఆర్ఎస్ నాయకులు జూపల్లి రమణారావు, మోహన్ రెడ్డి.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 20 Oct 2026 10:46 PM IST
Ashwaraopeta
X

Ashwaraopeta: వినాయకపురం వడ్ర బజార్‌లో ఘనంగా దసరా అన్న సమారాధన

అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం వినాయకపురం వడ్ర బజార్ లో దసరా ఉత్సవాల ఆఖరి రోజు సందర్భంగా నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ నాయకులు జూపల్లి రమణారావు, మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, యు.ఎస్. ప్రకాష్, తోంపాటి రమేష్ పాల్గొన్నారు.

అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొని భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA