Ashwaraopeta: బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మెచ్చా!
Ashwaraopeta: అశ్వారావుపేటలో బతుకమ్మ సంబురాల్లో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఉత్సాహంగా పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఆత్మీయ అనుబంధాన్ని పంచుకున్నారు.
Ashwaraopeta: బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మెచ్చా!
అశ్వారావుపేట: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ,BRS పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో బతుకమ్మ ఆడుతున్న మహిళల వద్దకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి బతుకమ్మ ఆడుతూ, పండుగ సంబురాల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.
ప్రజల మధ్యకు వెళ్లి వారితో కలిసిమెలిసి గడుపుతూ, స్థానికులతో ఆత్మీయ అనుబంధాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా మహిళలు మెచ్చా నాగేశ్వరరావు గారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ZPTC జూపల్లి రమణారావు గారు,జూపల్లి పద్మజా గారు,ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు సంక ప్రసాద్ గారు,మోహన్ రెడ్డి గారు,యుఎస్ ప్రకాశ్ రావు గారు,మాజీ సర్పంచ్ సాధు జ్యోత్స్న బాయి గారు,కలపాల బాబురావు గారు,లింగంకుంట కృష్ణ గారు,ఆరేపల్లి రాంబాబు గారు,రహీమూన్ గారు,జీళ్ల శ్రీదేవి గారు,బుజ్జి బాబు గారు,సోమాని రాజా రమేష్ గారు,ఆకుల శ్రీను గారు,అంజి గారు,ధర్మ గారు,చిప్పనపల్లి శ్రీను గారు,అబ్దుల్ రెహ్మాన్ గారు,దేవరపల్లి సాయి,అమీర్ గారు,బాలి కిరణ్ గారు,బన్ను గారు,సంతోష్ గారు, తదితరులు ఉన్నారు.




