Ashwaraopeta: వివాదాస్పద భూముల్లో రీ-సర్వే పూర్తి చేసిన అధికారులు
Ashwaraopeta: అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో గిరిజనులు, అటవీ అధికారుల మధ్య వివాదంలో ఉన్న సర్వే నంబర్ల భూముల్లో జాయింట్ రీ-సర్వే నిర్వహించిన అధికారులు.
Ashwaraopeta: వివాదాస్పద భూముల్లో రీ-సర్వే పూర్తి చేసిన అధికారులు
అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్లు 30, 36, 39 లలో గిరిజనులు మరియు అటవీ శాఖ అధికారుల మధ్య వివాదంలో ఉన్న భూములకు సంబంధించి ఈరోజు రీ సర్వే నిర్వహించారు.
ఈ రీ సర్వే కార్యక్రమంలో సర్వే డిపార్ట్ మెంట్ అధికారులు, అటవీ శాఖ అధికారులు, అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు మరియు రామన్నగూడెం గ్రామపంచాయతీ ఆదివాసీ ప్రజలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ నాగరాజు, అటవీ శాఖ రేంజర్ మురళి, అటవీ అభివృద్ధి సంస్థ సత్తుపల్లి డీఎం చంద్రమౌళి, సర్పంచ్ మడకం నాగేశ్వరరావు మరియు పోలీస్ డిపార్ట్ మెంట్ అధికారులు పాల్గొన్నారు.




