Ashwaraopeta: అశ్వారావుపేట వాసవి ఆలయంలో గాయత్రీ దేవి అలంకరణలో అమ్మవారు

Ashwaraopeta: అశ్వారావుపేట వాసవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు గాయత్రీ దేవిగా దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు నిర్వహించారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 15 Oct 2026 11:06 PM IST
Ashwaraopeta
X

Ashwaraopeta: అశ్వారావుపేట వాసవి ఆలయంలో గాయత్రీ దేవి అలంకరణలో అమ్మవారు

అశ్వారావుపేట: అశ్వారావుపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

ఉత్సవాలలో భాగంగా 5వ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పంచముఖాలు, దశభుజాలతో పద్మాసనంపై కొలువైన గాయత్రీ మాత అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

వేదమాత దర్శనం సకల శుభాలను కలిగిస్తుందని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వాసవి సంఘ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

ఫోటో క్యాప్షన్ కోసం: అశ్వారావుపేట వాసవి ఆలయంలో గాయత్రీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA