Ashwaraopeta: దసరా వేషాలు - మరుగున పడుతున్న మన పల్లె సంస్కృతి!

Ashwaraopeta: దసరా పండగ పూట పల్లెల్లో కనిపించే దసరా వేషాలు నేడు డీజే హోరులో కనుమరుగవుతున్నాయి. మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 15 Oct 2026 10:43 PM IST
Ashwaraopeta
X

Ashwaraopeta: దసరా వేషాలు - మరుగున పడుతున్న మన పల్లె సంస్కృతి!

అశ్వారావుపేట: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట దసరా హడావిడి మొదలయింది. దసరా వచ్చిందంటే చాలు, మన ఊర్లలో వీళ్ళు కనిపిస్తారు. ఒకరు శివుడిలా నీలం రంగు ముఖంతో, మరొకరు పార్వతి దేవిలా పసుపు రంగు ముఖంతో, ఇంకొకరు శివగణం లా జటలతో ఈ వేషాల వెనక ఒక పెద్ద కథ ఉంది.

వీళ్ళు అడుక్కునే వాళ్ళు కాదు, కళాకారులు. ఏడాది పొడవునా పొలం పనులు చేసుకుని, దసరా నవరాత్రుల 9 రోజులు మాత్రమే ఈ వేషాలు వేసుకుని ఊరూరా తిరుగుతారు. "అమ్మవారి పేరు చెప్పి బిచ్చం అడగడం" అనేది వీళ్ళ సంప్రదాయం. వీళ్ళని పిలవకపోయినా, వీళ్ళు ఇంటి ముందుకు వస్తే దసరా వచ్చినట్టే లెక్క.

ఫోటోలో చూడండి - ఎండలో, ఆ పెద్ద జుట్టు, ఆ బరువైన పూసల దండలు, ఆ రంగులతో ఎంత కష్టపడుతున్నారో. చేతిలో ఉన్న ఆ 10, 20 రూపాయలు వాళ్ళకు భిక్ష కాదు, ఆ కళకు ఇచ్చే గౌరవం. ఈ రోజుల్లో DJ సౌండ్ల మధ్య ఈ వేషాలు కనుమరుగవుతున్నాయి. మన పిల్లలకు ఈ వేషాలు ఏంటో కూడా తెలియట్లేదు.

రేపు మీ ఇంటి ముందుకు ఇలాంటి వేషం వస్తే, ఒక ఫోటో తీసి, చిన్న పిల్లలకు చూపించండి. వీలైతే 10 రూపాయలు ఇచ్చి, మన సంస్కృతిని బతికించండి.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA